ఆయన 100వ సినిమా నేనే చేయాల్సింది.. నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్
- నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్ నివాళి
- తన 100వ సినిమాలో నటించాలని చౌదరి కోరారని వెల్లడి
- తప్పకుండా నటిస్తానని తాను మాట ఇచ్చానన్న సూపర్ స్టార్
- ఎందరో టెక్నీషియన్లకు ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి అని కితాబు
- గొప్ప వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని ఆవేదన
ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ఆకస్మిక మృతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన 100వ సినిమాను తనతోనే తీయాలని అనుకుంటున్నట్టు చెప్పారని, అందుకు తాను అంగీకరించానని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. గురువారం చౌదరికి నివాళులర్పించిన అనంతరం రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు.
"నాలుగు నెలల క్రితం 'జైలర్ 2' షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆయన నన్ను కలిశారు. 'నేను 99 సినిమాలు పూర్తి చేశాను. 100వ సినిమా తీసి రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. ఆ సినిమాలో మీరే నటించాలి. నా దగ్గర రెండు, మూడు కథలున్నాయి, మీరు తప్పకుండా ఈ సినిమా చేయాలి' అని అడిగారు. దానికి నేను 100 శాతం చేస్తానని మాట ఇచ్చాను" అని రజనీకాంత్ వివరించారు. ఆర్బీ చౌదరితో తాను ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ, ఆయన తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని తెలిపారు.
"దర్శకుడు కేఎస్ రవికుమార్ చెప్పినట్టు ఆర్బీ చౌదరి ఎందరో దర్శకులను సృష్టించారు. ఇండస్ట్రీని నిలబెట్టి, ఎందరో టెక్నీషియన్లకు ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి ఆయన" అని రజనీ కొనియాడారు. 99 సినిమాలు నిర్మించినా ఏనాడూ సమస్యలు ఎదుర్కోలేదని, ఒకవేళ సమస్య వచ్చినా నేరుగా సంబంధిత వ్యక్తి ఇంటికే వెళ్లి పరిష్కరించే గొప్ప వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు.
"ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. దాని రహస్యం ఏంటని అడిగితే 'నా పరిమితులు నాకు తెలుసు, ఆ పరిధిలోనే సినిమాలు చేస్తాను. దేవుడిపై భారం వేసి మరో ప్రాజెక్ట్‌కు వెళ్లిపోతాను' అని చెప్పేవారు. ఇంత మంచి వ్యక్తి ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం" అని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం జరిగిన కారు ప్రమాదంలో ఆర్బీ చౌదరి మరణించిన విషయం తెలిసిందే.